ePaper
More
    HomeతెలంగాణTelangana politics | మొన్న ఆంధ్రా.. నేడు తెలంగాణ‌.. హరీశ్ రావు సభలో ‘రప్పా రప్పా’...

    Telangana politics | మొన్న ఆంధ్రా.. నేడు తెలంగాణ‌.. హరీశ్ రావు సభలో ‘రప్పా రప్పా’ డైలాగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana politics | ‘గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం..’ ఈ సినిమా పుష్ప‌ 2లో డైలాగ్. అల్లు అర్జున్ (Allu arjun) చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు తెగ ర‌చ్చ చేస్తోంది. ఇటీవ‌ల జగన్ మోహనరెడ్డి (Jagan mohan reddy) పర్యటనలో ఫ్లెక్సీల్లో ఈ డైలాగ్ ఫ్లెక్సీలు చూశాం.. మళ్లీ జగన్ మోహన్​రెడ్డి చెబితే కూడా విన్నాం. ఆయన చెప్పిన డైలాగులు.. తమ కార్యకర్తలకు, హార్డ్‌కోర్ అభిమానలకు ఊపునిస్తుందేమో కానీ.. మామూలు జనానికి మాత్రం ఆయన స్థాయికి తగనిది అనిపించింది. ఈ రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లోకి (Telangana politics) కూడా ప్రవేశించింది. మాజీమంత్రి హరీశ్ రావు (harish rao) పర్యటన సందర్భంగా కొందరు రప్పా రప్పా డైలాగ్ (Rappa Rappa dailouge) రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

    Telangana politics | ర‌ప్పా.. ర‌ప్పా..

    తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సభలో పుష్ప డైలాగ్ (Pushpa Dailouge) కలకలం రేగింది. హరీశ్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా (Allu arjun pushpa movie) డైలాగ్‌ రప్పా రప్పా అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు కొందరు. పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు. ఇది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలు (BRS Party) ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇది ఇలా ఉండగా ఏపీలో రప్పా రప్పా డైలాగ్ పొలిటికల్ హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. జగన్ పర్యటన సందర్బంగా ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శించినందుకు రవితేజ అనే యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.

    అర్ధరాత్రి సమయంలో పోలీసులు (Police) అతడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈక్రమంలో న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే రప్పా రప్పా డైలాగ్‌తో ప్లకార్డుల ప్రదర్శన జరుగుతుంది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State governament) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చ‌ర్చించుకుంటున్నారు జనాలు. పుష్ప సినిమా (Pushpa Movie) డైలాగ్ తెర మీదనే కాక రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this