Bichkunda | వైభవంగా గోరోబా కాక పుణ్యతిథి
Bichkunda | వైభవంగా గోరోబా కాక పుణ్యతిథి

అక్షరటుడే, బిచ్కుంద:Bichkunda | మద్నూర్ మండల కేంద్రంలో శనివారం సంత్ గోరోబా కాక కుంబార్ పుణ్యతిథి(Sant Goroba Kaka Kumbar Punyatithi) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్కారీలు భజన, కీర్తనలు చేశారు. పండరీపురం(Pandaripuram)  గోరోబా కాక జీవిత చరిత్ర గురించి భజనల రూపంలో వివరించారు. హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాంచాళ్ గోపాల్, కుమ్మరి కులస్థులు పెద్దలు మిద్దింటి గంగారం, జలరాం, దత్తు, విజయ్, గంగాధర్, విఠల్, హన్మాండ్లు, వీరేశం తదితరులు పాల్గొన్నారు.