అక్షరటుడే, వెబ్డెస్క్: Bhadrachalam Darshan | భద్రాచలంలో (Bhadrachalam) కొలువైన రాములోరి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. శ్రీరామనవమి పర్వదినాన స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి లక్షల మంది తరలి వస్తారు. జగదబిరాముడి దర్శనంతో ఎంతో మంది తరిస్తారు.
శ్రీరాముడి(Lord Sri Rama) దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం దర్శనం, ప్రసాదం, అర్చనలు తదితర కార్యకలాపాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఫెడరల్ బ్యాంక్ సౌజన్యంతో కియోస్క్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో వేగవంతంగా స్వామివారి సేవలను పొందవచ్చని ఈవో తెలిపారు.
భక్తులు డిజిటల్ సేవలు(Digital Services) పొందేందుకు ఏర్పాటు చేసిన కియోస్క్(Kiosk)ను ఆలయ ఈవో రమాదేవి(Temple EO Ramadevi) శనివారం ప్రారంభించారు. దీని ద్వారా దర్శనం, అర్చన, ప్రసాదం టికెట్లు తీసుకోవచ్చు. అంతేగాకుండా విరాళాలు కూడా సమర్పించవచ్చు. దీంతో వేగంగా స్వామి వారి సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. భక్తుల సమయం ఆదా అవుతుందని చెప్పారు.