ePaper
More
    HomeజాతీయంSonia Gandhi | ఇరాన్ ​– ఇజ్రాయెల్​ యుద్ధంపై మౌనం సరికాదు : సోనియా గాంధీ

    Sonia Gandhi | ఇరాన్ ​– ఇజ్రాయెల్​ యుద్ధంపై మౌనం సరికాదు : సోనియా గాంధీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sonia Gandhi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీ(Sonia Gandhi ) స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను ఆమె ఖండించారు. గాజా, ఇరాన్‌ విషయంలో కేంద్రం మౌనం వీడాలని ఆమె డిమాండ్​ చేశారు. గాజాలో నరమేధంపై భారత్‌ మౌనం మంచిది కాదన్నారు. భారత్‌(Bharath)కు ఇరాన్‌ చిరకాల మిత్రదేశమని, దానిని దూరం చేసుకోవడం మంచిది కాదని సోనియా గాంధీ అన్నారు.

    ఇరాన్ – ఇజ్రాయెల్(Iran – Israel)​ యుద్ధంపై భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. ఈ క్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. గాజా-ఇరాన్‌ విషయంలో భారత్ మౌనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువలు కోల్పోవడం అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి భారత దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అన్నారు.

    Sonia Gandhi | అది సరైన చర్య కాదు

    ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా గాంధీ అన్నారు. టెహ్రాన్‌(Tehran)పై, టెల్‌ అవీవ్‌(Tel Aviv) చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమైనవిగా.. సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు. ఇరాన్‌, అమెరికాల మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న సమయంలో అణుస్థావరాలపై దాడులకు దిగడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం ఇరాన్‌లో పునరావృతం అవకుండా భారత్‌ కల్పించుకోవాలని కోరారు.

    More like this

    Ganesh Immersion | సార్వజనిక్ గణేశ్​ మండలి రథానికి పూజలు

    అక్షరటుడే, ఇందూరు : Ganesh Immersion | సార్వజనిక్ గణేశ్​ మండలి (Sarvajanik Ganesh Mandali) రథానికి శనివారం...

    SIIMA Awards | దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా సైమా వేడుక‌.. పుష్క‌2, క‌ల్కి చిత్రాల‌దే హ‌వా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: SIIMA Awards | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 వేడుకలు దుబాయ్‌(Dubai)లో...

    Rangareddy District | వినాయకుడి మెడలో బంగారు గొలుసు.. మ‌రిచిపోయి అలానే నిమజ్జనం! తీరా గుర్తొచ్చిన తర్వాత…

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rangareddy District | వినాయక నవరాత్రోత్సవాల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు, నిమజ్జనాలు జరుపుకుంటున్న...