ePaper
More
    HomeజాతీయంTamilnadu Governor | 73 ఏళ్ల వయసులో ఏకంగా 51 పుషప్స్ .. సంభ్రమాశ్చర్యాలకు గురి...

    Tamilnadu Governor | 73 ఏళ్ల వయసులో ఏకంగా 51 పుషప్స్ .. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన గ‌వ‌ర్న‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamilnadu Governor | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయ‌కులు, పారాశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు అంద‌రూ యోగాస‌నాలు చేశారు. కొంద‌రు తమ యోగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ యోగాకు సంబంధించిన అనుభ‌వాలు పంచుకున్నారు. ఇక యోగా డేను పునస్కరించుకొని తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి (Ravindra Narayana Ravi) ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చూసి అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. ఆయ‌న మిగతా వాళ్లలా చిన్నపాటి ఆసనాలు, వ్యాయమాలు చేయలేదు. తన వయసు వారు సైతం అవాక్కయ్యేలా ఏకబిగిన 51 పుషప్స్ చేసి ఔరా అనిపించారు.

    Tamilnadu Governor | ఏం ఫిట్‌నెస్..

    రాష్ట్రానికి తొలి పౌరుడిగా ఉన్న తాను ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలోనూ తాను ముందువరుసలోనే ఉంటానని చాటారు. గవర్నర్(Tamilnadu Governor) ఉత్సాహంగా పుషప్స్ తీస్తుంటే అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక ఆ వీడియో చూసినవాళ్లు ‘వామ్మో 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారేంటి?’ అని నోరెళ్లబెడుతున్నారు. కొందరేమో ‘మీది మామూలు బాడీ కాదు సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏమాత్రం అలసట లేకుండా వరుసగా 51 పుషప్స్(51 pushups) పూర్తి చేశారు. ఆయన ఉత్సాహంగా పుషప్స్ చేస్తుండగా, అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు.

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) మధురైలోని వెల్మల్​ విద్యా సంస్థలో యోగా వేడుకల్ని నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ రవీంద్ర నారాయణ రవి తన ఫిట్‌నెస్‌తో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి హాట్ టాపిక్ అయ్యారు. తెలుపు రంగు టీషర్ట్, నలుపు ప్యాంట్ ధరించిన ఆయన.. ఏమాత్రం అలుపెరగకుండా వరుసగా 51 పుషప్స్‌ తీశారు. వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపించిన గవర్నర్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. బీహార్‌కు చెందిన రవీంద్ర.. ఫిజిక్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం సివిల్స్‌కు సన్నద్దం కాగా.. 1976లో కేరళ కేడర్‌కు ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. 2021లో రవీంద్రను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్.

    Latest articles

    Gas cylinders | హోటళ్లు, రెస్టారెంట్లపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు..సిలిండర్లు స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి: Gas cylinders | ఇళ్లలో అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లుగా సివిల్...

    Telangana | రాష్ట్రంలో భారీగా పెరిగిన అబార్షన్లు.. రాజ్యసభలో తెలిపిన కేంద్రం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | తెలంగాణ రాష్ట్రంలో అబార్షన్లు (Abortions) భారీగా పెరిగాయి. ఐదేళ్ల గర్భస్రావాలు ఏకంగా...

    Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో కీలక అధికారులకు విశిష్ట గుర్తింపు.. తొమ్మిది మంది వైమానిక దళ సిబ్బందికి వీర్ చక్ర అవార్డులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన వారికి కేంద్ర ప్రభుత్వం...

    Excise Department | నగరంలో గంజాయి విక్రేత అరెస్ట్​.. పరారీలో మరో నిందితుడు..

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Excise Department | నగరంలో గంజాయిని (Marijuana) విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్​ ఎక్సైజ్​ పోలీసులు...

    More like this