ePaper
More
    Homeభక్తిTTD | తిరుమలలో ఉచితంగా వీఐపీ బ్రేక్​ దర్శనం.. ఎలాగో తెలుసా!

    TTD | తిరుమలలో ఉచితంగా వీఐపీ బ్రేక్​ దర్శనం.. ఎలాగో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | తిరుమల Tirumala శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకొని తరిస్తారు. ఆయన దర్శన భాగ్యం కోసం ఎందరో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్​లలో వేచి ఉండాలి. వీఐపీ దర్శనంతో VIP Darshanam స్వామి వారిని త్వరగా దర్శించుకునే వీలున్న అది అందరికి సాధ్యం కాదు. అయితే తాజాగా టీటీడీ TTD ఉచితంగా వీఐపీ బ్రేక్​ దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. దానికోసం గోవింద నామాలు govinda namalu రాయాలని సూచించింది.

    గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. 200 పేజీలు గల గోవింద కోటి పుస్తకం ధర రూ.111గా నిర్ణయించింది. ఒక్కో పుస్తకంలో 39,600 వంతున, 26 పుస్తకాలలో 10 లక్షలా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన వారికి ఉచితంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. 253 గోవింద కోటి పుస్తకాలలో కోటి సార్లు రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ సభ్యులు ఐదు మందితో కలిసి ఒకసారి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం, వసతి కల్పిస్తామని టీడీడీ వివరించింది. స్వామి వారి భక్తితో తరలించే వారు గోవింద నామాలు రాసి పుణ్యంతో పాటు, ఆయన దర్శన భాగ్యం దక్కించుకోవచ్చు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...