Banswada
Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | అనుమానాస్పద స్థితిలో పార్ట్​టైం లెక్చరర్​ మృతి చెందింది. ఈ ఘటన నుస్రుల్లాబాద్ (Nasrullabad)​ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్ (Morthad) మండలం గాండ్లపేట గ్రామానికి (Gandlapet) చెందిన స్వప్న(34) నస్రుల్లాబాద్​ మండలం దుర్కిలోని గిరిజన గురుకుల పాఠశాల\కళాశాలలో (Tribal Gurukul School/college) పార్ట్ టైం లెక్చరర్​గా మూడేళ్లుగా పనిచేస్తోంది.

శుక్రవారం ఉదయం కోదాడలో టెట్ ఎగ్జామ్ (TET Exam) రాసి వచ్చి కళాశాలలో రాత్రి నైట్​డ్యూటీ చేసింది. అనంతరం రాత్రి పిల్లలతో కలిసి నిద్రించి ఉదయం లేవలేదు. దీంతో విద్యార్థినులు ప్రిన్సిపల్​కు సమాచారం ఇచ్చారు. బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.