ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్ర‌మాదం త‌ర్వాత మిస్ అయిన ద‌ర్శ‌కుడి జాడ ల‌భ్యం.....

    Ahmedabad Plane Crash | విమాన ప్ర‌మాదం త‌ర్వాత మిస్ అయిన ద‌ర్శ‌కుడి జాడ ల‌భ్యం.. కానీ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ahmedabad Plane Crash | అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం వ‌ల‌న విమానంలోని వారు, కాలేజీలోని వారు.. హాస్టల్ పరిధిలో నేలపై ఉన్న వారు కూడా చనిపోయారు. నేలపై ఉన్న 29 మంది విమాన శకలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. అయితే బాలీవుడ్ దర్శకుడు మహేష్ జీరావాలా (Mahesh Jirawala) ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుండి కనిపించకుండా పోయారు. అహ్మదాబాద్ విమానం ప్రమాదం జరిగిన రోజే ఆయన కనిపించకుండా పోయారు. 29 మందిలో తన భర్త ఉండకూడదని దేవుడ్ని ప్రార్థించింది ఆయ‌న భార్య. అతడు ఇంటికి తిరిగి వచ్చే క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. కానీ చివ‌రికి అత‌ను ఆ ప్ర‌మాదంలో క‌న్నుమూసాడ‌ని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తోంది.

    Ahmedabad Plane Crash | తీవ్ర విషాదం..

    ఇన్నాళ్లు విమాన ప్రమాదం జరిగిన తర్వాత అదృశ్యం అయ్యాడనుకున్న మ‌హేష్‌ కూడా అదే ప్రమాదంలో అసువులు బాశారు. ముఖ్యంగా డీఎన్‌ఏ పరీక్షల(DNA Tests) ద్వారా వైద్య సిబ్బంది ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆపై ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించగా.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త గుజరాతీ చిత్ర పరిశ్రమ(Gujarati film industry)లో మరియు ఆయన అభిమానులలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారందరి మృతదేహాలు పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఇలా చిత్ర నిర్మాత మృతదేహానికి DNA పరీక్ష చేయగా.. కుటుంబ సభ్యుల శాంపిల్స్‌తో మ్యాచ్ అయ్యాయి. ఇలా ఆయన మృతదేహాన్ని నిర్ధారించిన వైద్యులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఆపై ఆయన మృతదేహాన్ని అందజేశారు.

    అతడి మృతి వార్త తెలుసుకున్న భార్య, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇన్నాళ్లూ బతికే ఉంటాడేమోనని భావించిన తమకు.. తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని వివరిస్తున్నారు. మ‌హేష్ భార్య ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేశాడు. మీటింగ్ అయిపోయిందని, ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పాడు. అయితే, ఇంటికి తిరిగి రాలేదు. నేను అతడి ఫోన్‌కు కాల్ చేశాను. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. మిస్సింగ్ కేసు పెట్టాను. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరి సారిగా అతడి ఫోన్ సిగ్నల్ విమాన ప్రమాదం జరిగిన 700 మీటర్ల దూరంలో చూపిస్తోంది. విమాన ప్రమాదం(Plane Crash) 1.39 గంటలకు జరిగింది. అతడి ఫోన్ 1.40కి స్విచ్ఛాఫ్ అయింది. అతడి ఫోన్, స్కూటర్ కూడా కనిపించటం లేదు’ అని చెప్పుకొచ్చారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...