ePaper
More
    HomeతెలంగాణMahabubabad | పెళ్లయిన 18 రోజులకే వరుడి రెండో వివాహం!.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

    Mahabubabad | పెళ్లయిన 18 రోజులకే వరుడి రెండో వివాహం!.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | పెళ్లయిన 18 రోజులకే వరుడు రెండో వివాహం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) డోర్నకల్ లో వెలుగు చూసింది. దీనిపై మొదటి భార్య శుక్రవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డోర్నకల్ సీఐ రాజేష్ (Dornakal CI Rajesh) కథనం ప్రకారం… రాజుతండాకు చెందిన స్వప్నకు మే 8న జయశంకర్ భూపాలపల్లిలో నివాసం ఉండే బోడ హర్షిత్ తో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.4 లక్షల నగదు, 200 గజాల ఓపెన్ ప్లాట్, అర ఎకరం పొలం, ఆరు తులాల బంగారం, ఇతర లాంఛనాలు గట్టిగానే చెల్లించారు.

    కానీ, కొన్ని రోజులకే భర్త మరో యువతితో తరచూ మొబైల్లో మాట్లాడుతుండటాన్ని స్వప్న గుర్తించింది. ఈ విషయాన్ని తన అత్త పద్మ (mother-in-law Padma), మామ హరి దృష్టికి కూడా తీసుకెళ్లింది. కాగా, భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయి సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో స్వప్నకు మరింత అనుమానం కలిగి ఆరా తీయగా.. భూపాలపల్లిలోని (Bhupalapally) మహాముత్తారం శివారు యానంపల్లికి చెందిన సాయిప్రియ అనే అమ్మాయిని మే 25న హర్షిత్ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బాధితురాలు తాను మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు హర్షిత్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ వెల్లడించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...