ePaper
More
    HomeతెలంగాణMla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్‌.. కార‌ణం ఏంటంటే..!

    Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్‌.. కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని padi kaushik reddy వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో అదుపులోకి తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసి అక్క‌డి నుండి వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనపై భారతీయ శిక్షా స్మృతి (BNS)లోని సెక్షన్ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని(Huzurabad Mla) మరికాసేపట్లో కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. సుబేదారి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈ విషయంలో చుక్కెదురైంది.

    Mla Koushik Reddy | కీల‌క ప‌రిణామం..

    కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. జూన్ 16న దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్​ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్ట్‌పై స్టే ఇచ్చిన కోర్టు, దర్యాప్తునకు సహకరించాలని అప్పట్లో ఆదేశించింది. తాజాగా పిటిషన్ కొట్టివేయడంతో కౌశిక్ రెడ్డి అరెస్ట్‌(Kaushik Reddy arrest)కు మార్గం సుగమమైంది.

    బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న కౌశిక్ రెడ్డిని కావాలనే అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy), ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిలపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ సీఐ రాఘవేంద్ర తన ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని, తనను చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. వాగ్వాదం తీవ్రం కావడంతో, సీఐ రాఘవేంద్ర తన విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...