Bichkunda
Bichkunda | రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | బిచ్కుంద విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ పవన్‌కుమార్‌ తెలిపారు. స్థానిక 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.