అక్షరటుడే,ఎల్లారెడ్డి: Yellareddy | డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత ముందుండాలని ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (government Degree college) ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Telangana Anti Narcotics Bureau) తరపున ఈరోజు కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, కళాశాల మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయకర్త శంకరయ్య, అధ్యాపకులు జంగం శివకుమార్, అమరేశం, ప్రభాకర్ రావు, అరుణ్ కుమార్, నాగనిక, సిద్దు రాజు, రాణి, గంగారెడ్డి, చంద్రకాంత్, గోదావరి తదితరులు పాల్గొన్నారు.
