ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మద్యం అమ్మితే రూ. లక్ష జరిమానా.. చెప్పు దెబ్బలు.. ఎక్కడో తెలుసా..?

    Kamareddy | మద్యం అమ్మితే రూ. లక్ష జరిమానా.. చెప్పు దెబ్బలు.. ఎక్కడో తెలుసా..?

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: మద్యం విక్రయాలకు గ్రామాలు కేరాఫ్ అడ్రస్​గా మారుతున్నాయి. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టడానికి గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో టెండర్లు వేస్తున్న నేటి తరుణంలో శుక్రవారం మూడు గ్రామాలు మద్య నిషేధం విధిస్తూ తీర్మానం చేయడమే కాకుండా కఠినమైన శిక్షలు ఖరారు చేశారు.

    రాజంపేట (Rajampet) మండలంలోని గుండారం (Gundaram), ఎల్లాపూర్ తండా (Yellapur Thanda), నడిమి తండా (Nadimi thanda) ప్రజలు గుండారం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులంతా మద్యం విక్రయాలు, మద్యం సేవించడం నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అంతేకాకుండా తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే రూ. లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు అంటూ తీర్మానం చేశాయి. అదే సమయంలో మద్యం విక్రయించిన వారి వివరాలు వెల్లడించిన వారికి రూ.20వేల బహుమతి ప్రకటించారు. గ్రామాల సరిహద్దుల్లో ఎవరు మద్యం తాగినా శిక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి పీక్కొని తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూ(Safari World Zoo)లో భయానక సంఘటన...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...