ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDisha meeting | టీచర్ల డిప్యుటేషన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Disha meeting | టీచర్ల డిప్యుటేషన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Disha meeting | విద్యాశాఖలో (education department) డిప్యుటేషన్లపై ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA Madan Mohan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం లేకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటే మేమెందుకని ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar) అధ్యక్షతన దిశ సమావేశం (Disha meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారులతో పైవిధంగా స్పందించారు. టీచర్ల అంతర్ జిల్లాల డిప్యుటేషన్​పై దిశ కమిటీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు డీఈవో సమాధానమిస్తూ అంతర్ జిల్లాల డిప్యుటేషన్ తమ పరిధిలో ఉండదని తెలిపారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు టీచర్ల డిప్యుటేషన్​పై (Teacher deputation) తమకు సమాచారం అందించాలని సూచించారు. తన నియోజవర్గంలో పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ఎర్రపహాడ్ పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉంటే ఎస్​డీఎఫ్​ నిధుల(SDF funds) కింద రూ.18 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దిశ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించట్లేదన్నారు. దోమకొండ మండలం లింగుపల్లి పాఠశాలలో పరిసరాలు అధ్వానంగా మారాయని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ సభ్యురాలు కవిత తెలిపారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు.

    Disha meeting | బీమా పథకంపై అవగాహన కల్పించాలి

    రైతు భీమా పథకంపై (Rythu Bhima Scheme) రైతులకు అవగాహన కల్పించాలని ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar) అధికారులకు సూచించారు. అమృత్ స్కీం కింద కొనసాగుతున్న పనుల వివరాలను ఎంపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో రూ.93 కోట్లతో పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 100 కిలోమీటర్ల పైప్​ లైన్ పనుల్లో 26 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

    Disha meeting | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో..

    ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో (Yellareddy Municipality) రూ.35 కోట్లతో 47 కిలోమీటర్లు పైప్​లైన్ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ నుంచి అర్గుల్, ఇందల్​వాయి మీదుగా మల్లన్నగుట్ట వరకు నీళ్లు వస్తాయని అధికారులు తెలపగా.. గతంలో పైప్​లైన్ పగిలిపోయిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. పనులపై పక్కా ప్లానింగ్ లేదని, జహీరాబాద్​కు (Zaheerabad) మంజీర నీటిని తెచ్చినట్లు శ్రీరాంసాగర్ నీటిని నేరుగా తీసుకురాలేమా అని ప్రశ్నించారు. క్వాలిటీ పైపులు వాడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో (private hospitals) దోపిడీని నియంత్రించాలని కమిటీ సభ్యులు కోరారు. ఓ న్యూరాలజీ ఆస్పత్రిలో చికిత్స కోసం రూ. వేలల్లో మందులు రాస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

    Disha meeting | ఎమ్మెల్యేల గైర్హాజరు

    కలెక్టరేట్​లో నిర్వహించిన దిశ సమావేశానికి ఎప్పటిలాగే జిల్లా ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గత సమావేశంలో ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరు కాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipalli Venkata Ramana Reddy) గైర్హాజరయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో సమావేశానికి రాలేదని సమాచారం.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...