ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP Secretariat | ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌.. వారానికి 5 రోజులే...

    AP Secretariat | ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌.. వారానికి 5 రోజులే పని..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Secretariat | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) కూటమి సర్కార్ ఇవాళ రాష్ట్ర సచివాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభ‌వార్త అందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం (TDP Governament) అధికారంలో ఉండగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని మరోసారి పొడిగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం (Chandra babu Governament) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్(Andhra Pradesh Secretariat)లో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం వారానికి 5 రోజులు మాత్రమే పనివేళలు ఉన్నాయి. ఇవి మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    AP Secretariat | ఉత్త‌ర్వులు జారీ..

    ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ (Andhra Pradesh Secretariat) ఎంప్లాయీస్​తో పాటు, వివిధ శాఖాధిపతుల, కార్పోరేషన్ విభాగాల అధిపతులు వారి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి కేవలం 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉంది. వారానికి ఐదు రోజుల డ్యూటీని మరో ఏడాది పొడిగిస్తూ ఇవాళ సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వారు కొన్నేళ్లుగా వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాది వీరికి ఏడాది పొడిగింపు ఇస్తూ వస్తున్నారు. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు మరికొందరికి కూడా ఈ ఊరట కొనసాగనుంది.

    సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులు.. వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉత్తర్వుల గడువు ఈ నెల 26తో ముగియనుంది. తాజాగా ఈ గడువు మరో ఇయర్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వచ్చే ఏడాది 27 జూన్ 2026 వరకు వారానికి ఐదు రోజులు దినాలు.. రెండు రోజుల సెలవు దినాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్. సెక్రటేరియట్​తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో (government departments) ముఖ్యంగా పోలీస్, హాస్పిటల్, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ పనిచేసే వారికి కూడా ఈ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమర్జెన్సీ సర్వీసుల్లో (Emergency service) పనిచేసేవారికి వారంలో ఏదైనా రెండు రోజులు సెలవులు ఇచ్చేలా చూడాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈనెల 26తో ముగుస్తుంది.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...