అక్షరటుడే, బాన్సువాడ: RTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి డీలక్స్ బస్సు ప్యాకేజీ టూర్ ఈనెల 27న నిర్వహిస్తున్నామని బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. బాన్సువాడ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి యాదాద్రి నరసింహస్వామి దర్శనం అనంతరం, స్వర్ణగిరి ద్వారా రాత్రి ఒంటి గంటకు బాన్సువాడ చేరుకుంటుందన్నారు. టికెట్ ధర రూ.1,000 ఉందని బుకింగ్ కోసం 9063408477లో సంప్రదించాలని ఆమె కోరారు.
