ePaper
More
    HomeజాతీయంRajasthan | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన తొమ్మిదేళ్ల కొడుకు

    Rajasthan | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన తొమ్మిదేళ్ల కొడుకు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు ప్రస్తుత సమాజంలో ఎన్నో నేరాలకు పాల్పడుతున్నాయి. దేశంలో జరుగుతున్న చాలా హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలే(Extramarital affairs) కారణం అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి తన భర్తను హత్య చేయించింది. ఈ విషయాన్ని ఆమె తొమ్మిదేళ్ల కొడుకు పోలీసులకు చెప్పడంతో ఇప్పుడు జైలు పాలైంది.

    ప్రస్తుతం వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి. దీంతో చాలా మంది ఆ బంధం మోజులో పడి కట్టుకున్న వారిని, కన్నబిడ్డలను కూడా అంతం చేస్తున్నారు. తాత్కాలిక ఆనందం కోసం ప్రాణాలు తీస్తున్నారు. అంతేగాకుండా తర్వాత పోలీసులకు చిక్కి తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.

    రాజస్థాన్‌లోని అల్వార్‌(Alwar)లో ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది. ఆమె కుమారుడు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడింది. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడు పోలీసులకు(Police) అన్ని వివరాలు చెప్పాడు. బాలుడి చెప్పిన వివరాల ప్రకారం.. తన తండ్రి ఫోన్​ ఛార్జింగ్​ పెట్టమని చెప్పి త్వరగా పడుకున్నాడు. ఆయన పడుకోగానే తన తల్లి తలుపు తీసింది. ఆమె ప్రియుడితో పాటు మరో నలుగురు ఇంట్లోకి వచ్చారు. అనంతరం బాలుడి తండ్రిని చంపేశారు. ఆ సమయంలో తన తల్లి మౌనంగా ఉండడంపై బాలుడు ప్రశ్నించాడు. అయినా ఆమె స్పందించలేదు. ఎట్టకేలకు బాలుడు సాక్ష్యం చెప్పడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...