Anti Drug Committee
Anti Drug Committee | మాదకద్రవ్యాల నిర్మూలనపై అధ్యాపకుల ప్రతిజ్ఞ

అక్షరటుడే, బిచ్కుంద: Anti-Drug Committee | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College)లో శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో బాధ్యతగా వ్యవహరిస్తామని పేర్కొంటూ అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్​ అశోక్​ మాట్లాడుతూ డ్రగ్స్‌ మాయలో పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్ కో‌‌–ఆర్డినేటర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.