Registration Department
Registration Department | రిజిస్ట్రేషన్లు ఆపితే చర్యలు : డీఐజీ వెంకట రమణ

అక్షరటుడే, ఇందూరు: Registration Department | నిబంధనల ప్రకారం స్లాట్​ బుక్​ చేసుకుని వచ్చే డాక్యుమెంట్లను ఆపవద్దని, అలాంటి వారు ఎవరైనా ఉంటే చర్యలు తప్పవని శాఖ ఇన్​ఛార్జి డీఐజీ వెంకట రమణ (DIG Venkata Ramana) పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (Registrations Department) నిజామాబాద్​ డీఐజీగా (Nizamabad DIG) ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజువారి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు. దరఖాస్తు దారులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. స్లాట్​ టైం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు. కాగా.. ఇటీవల రిజిస్ట్రేషన్లను ఓ అధికారి నిలిపివేయడంపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో డీఐజీ స్పందించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్లాట్లు బుక్​ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు.

Registration Department | రెండు నెలల సెలవులో డీఐజీ

స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్​ డీఐజీగా రమేశ్​ రెడ్డి (Ramesh Reddy) రెండు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ (Registration Department) ఆడిట్​ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి.వెంకట రమణకు ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రమేశ్​ రెడ్డి తిరిగి విధుల్లో చేరే వరకు ఇన్​ఛార్జిగా వ్యవహరించనున్నారు.