అక్షరటుడే ఇందూరు: బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్‌ను నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్, గంగాధర్, చంద్రకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.
