అక్షరటుడే, బాన్సువాడ: Mla pocharam | బాన్సువాడను విద్య, వైద్య రంగాలకు హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలం దుర్కి శివారులో ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల (Government BSc Nursing College) భవన సముదాయ పనులపై శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. రూ.40 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందన్నారు.
