ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ తప్పించుకోలేరు.. గోనె ప్రకాశ్​ సంచలన...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ తప్పించుకోలేరు.. గోనె ప్రకాశ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో మాజీ సీఎం కేసీఆర్​ (KCR) తప్పించుకోలేరని మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాశ్​రావు (Gone Prakash Rao) అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సిట్​ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు నిందితులను విచారిస్తునే బాధితుల స్టేట్​మెంట్​ రికార్డు చేస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్​ అయ్యాయో వారి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గోనె ప్రకాశ్​ రావు స్టేట్​మెంట్​ను జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో అధికారులు రికార్డు చేశారు.

    Phone Tapping Case | అంతా కేసీఆర్​కు తెలిసే జరిగింది

    సిట్​ అధికారుల విచారణ అనంతరం ప్రకాశ్​రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం అంతా కేసీఆర్​కు తెలిసే జరిగిందని ఆయన అన్నారు. ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కులానికి చెందిన కొందరు అధికారులకు కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​ బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రభాకర్​రావు రిటైర్డ్​ అయ్యాక ఎస్​ఐబీ చీఫ్​ చేశారని, ప్రణీత్​ రావుకు డబుల్​ ప్రమోషన్​ ఇచ్చి డీఎస్పీ చేశారని చెప్పారు. కేటీఆర్, సంతోష్​రావు కలిసి కవిత ఫోన్ ట్యాప్ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Phone Tapping Case | ట్యాపింగ్​తోనే ఓటుకు నోటు వెలుగులోకి..

    ఫోన్​ ట్యాపింగ్​ చేయడంతోనే ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిందని ప్రకాశ్​రావు అన్నారు. అంతేగాకుండా సొంత పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి, రేగా కాంతారావు ఫోన్లను కూడా ట్యాప్​ చేశారన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంగా విచ్చలవిడిగా ట్యాపింగ్​కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, సినిమా వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్​ చేశారన్నారు.

    Phone Tapping Case | ప్రభాకర్​ రావు అరెస్ట్​ తప్పదు

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​ రావు అరెస్ట్​ తప్పదని ప్రకాశ్​రావు అన్నారు. ఆగస్టు 5 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు (supreme court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 5 తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రకాశ్​రావు తెలిపారు. అనంతరం కస్టడీకి తీసుకుంటారని, తర్వాత కేసీఆర్​ పేరు బయటకు వస్తుందన్నారు.

    Phone Tapping Case | అప్పుడే బీజేపీకి అవకాశం

    బీఆర్​ఎస్(BRS)​ బలహీనం అయితేనే రాష్ట్రంలో బీజేపీ(BJP)కి అవకాశం ఉంటుందని గోనె ప్రకాశ్​ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్​ ట్యాపింగ్​పై విచారణ చేపట్టి కేసీఆర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్​ చేయకపోవడంతో 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచిందన్నారు. తర్వాత కవితను అరెస్ట్​ చేయడంతో పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ జీరో అయిపోయిందని, బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని చెప్పారు. కాబట్టి బీజేపీ బలపడాలంటే సీబీఐతో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...