ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Rythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వానాకాలం సీజన్​ రైతు భరోసా(Rythu Bharosa) పొందడానికి ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది. జూన్​ 5 లోపు పట్టాపాస్​బుక్​ పొందిన వారు ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్​ 20(శుక్రవారం)లోగా దరఖాస్తు చేసుకుంటే ఈ సీజన్​కు సంబంధించి రైతు భరోసా జమ చేస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు గడువు ముగియనున్న నేపథ్యంలో గతంలో రైతు భరోసా పొందని వారు, కొత్తగా పాస్​బుక్​లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాలనుకునే వారికి కూడా నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు.

    Rythu Bharosa | నాలుగు రోజుల్లో రూ.6,405 కోట్లు జమ

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. 4 రోజుల్లో రూ.6,405 రైతులకు(Farmers) ఖాతాల్లో జమ అయ్యాయి. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరో రూ.1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...