ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Olympic Run | జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

    Olympic Run | జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Olympic Run | జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్ రన్ నిర్వహించారు. నగరంలోని ఆర్​ఆర్​ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్ పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది.

    ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా క్రీడల్లో జిల్లా క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు పైకి రావాలన్నారు. చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రన్​లో స్కేటింగ్ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి (Eega Sanjeeva Reddy), ఛైర్మన్ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    ఒలింపిక్​ రన్​లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...