ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael - Iran War | తారాస్థాయికి యుద్ధం.. క్ల‌స్ట‌ర్ బాంబులు వేసిన ఇరాన్‌

    Israel – Iran War | తారాస్థాయికి యుద్ధం.. క్ల‌స్ట‌ర్ బాంబులు వేసిన ఇరాన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Israel – Iran War | ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ద‌క్షిణాసియా ర‌గులుతోంది. గ‌త శుక్రవారం మొద‌లైన సంఘ‌ర్ష‌ణ ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరుదేశాలు క్షిపణులు, డ్రోన్ల‌తో తాజాగా దాడుల‌కు దిగాయి. ఇరాన్‌(Iran)లోని అణు మౌలిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేయ‌గా, అందుకు ప్రతిగా ఇరాన్ టెల్ అవీవ్‌(Tel Aviv)పై తొలిసారి క్లస్టర్ బాంబులు(cluster bombs) ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని ఆస్పత్రిపై ఇరాన్ గురువారం క్షిపణులతో దాడి చేసింది. నగరంలోని సోరోకా ఆస్పత్రి(Soroka Hospital)పై దాడి తర్వాత వరుసగా రెండో రోజు బీర్షెబా నగరంపై క్షిప‌ణులు ప్ర‌యోగించింది. ఇజ్రాయెల్ ప్ర‌ధాన పరిశోధ‌నా సంస్థ అయిన వీజ్మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌పై క్షిప‌ణి దాడులు చేసింది. కీల‌క‌మైన బ‌హుళ ప్ర‌యోగాలు చేప‌ట్టి ఆ సంస్థ‌పై దాడితో టెల్ అవీవ్‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. త‌ద్వారా ఇరాన్ నైతిక విజ‌యం సాధించిన‌ట్ల‌యింద‌ని అసోసియేటెడ్ ప్రెస్ మాలిక్యులర్ సెల్ బయాలజీ. మాలిక్యులర్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్ ఓరెన్ షుల్డినర్(Neuroscience Oren Schuldiner) తెలిపారు.

    మ‌రోవైపు, ఈ ఘటనపై ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ స్పందించారు. అందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మ‌రోవైపు, ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ(Ayatollah Ali Khamenei)ని అంత‌మొందించేందుకు ఇజ్రాయెల్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఖమేనీని హ‌త‌మార్చ‌డంతోనే యుద్ధం ముగుస్తుంద‌ని ఇప్ప‌టికే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(Israeli Defense Minister Israel Katz) స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళాల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు, ఇరాన్ అణు మౌలిక వ‌స‌తుల‌పై ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగిస్తోంది. అరక్ హెవీ వాటర్ రియాక్టర్‌పై దాడులు చేసింది. ఈ విష‌యాన్ని ఇరాన్ కూడా ధ్రువీక‌రించింది. దాడికి ముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని తెలిపింది. దాడుల కార‌ణంగా ఎటువంటి రేడియేషన్ ప్రమాదం జ‌రుగ‌ద‌లేద‌ని ఇరాన్ స్టేట్ టెలివిజన్ పేర్కొంది.

    Israel – Iran War | డొలాయ‌మానంలో అమెరికా

    ఇరాన్‌పై దాడి చేయాలా.. వద్దా అనేది తేల్చుకోలేక అగ్ర‌రాజ్యం డోలాయ‌మానంలో ప‌డింది. అమెరికా(America) యుద్ధంలోకి దిగితే ప‌రిస్థితులు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చ‌రించిన నేప‌థ్యంలో సందిగ్ధంలో ప‌డింది. మ‌రోవైపు, ఇరాన్‌పై చ‌ర్య‌ల‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్(White House) తెలిపింది. అణు కార్యక్రమంపై ఇరాన్ చ‌ర్చ‌ల‌కు వ‌స్తుంద‌ని, ఒప్పందం కుదుర్చుకుంటుంద‌న్న భావ‌న‌తో ట్రంప్ ఉన్నార‌ని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌కు ట్రంప్ రెండు వారాల గడువు విధించారు. అనంతరం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చేది లేనిది వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ సారథ్యంలో అణ్వాయుధాలను మరో రెండు వారాల్లో ఇరాన్ తీసుకువస్తుందని.. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...