ePaper
More
    HomeసినిమాKubera | ధ‌నుష్‌, నాగార్జున ‘కుబేర’ ట్విట్టర్​ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా?

    Kubera | ధ‌నుష్‌, నాగార్జున ‘కుబేర’ ట్విట్టర్​ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kubera | ధనుష్ (Dhanush), నాగార్జున, రష్మిక మందన్నా ప్ర‌ధాన తారాగ‌ణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రం ఈ రోజు విడుద‌ల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి అందిన తొలి రివ్యూలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభం కావ‌డంతో, సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫ‌స్టాప్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంద‌ని, ముఖ్యంగా ధ‌నుష్(Hero Dhanush) ఎంట్రీ త‌ర్వాత మూవీ సూప‌ర్బ్​ అంటూ పోస్టులు పెడుతున్నారు. ధ‌నుష్ త‌ప్ప మ‌రెవ‌రూ ఈ పాత్ర చేయ‌లేర‌ని, మ‌రోసారి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ప‌క్కా అంటూకామెంట్స్ వినిపిస్తున్నాయి.

    Kubera | పాజిటివ్ టాక్..

    ఈ మధ్య కాలంలో వచ్చిన ధనుష్ సినిమాలన్నింటిలో.. కుబేర సినిమాలో ఇచ్చిన పెర్ఫామెన్స్ అలా పీక్స్‌లో ఉంద‌ని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈసినిమాతో ఖచ్చితంగా ధనుష్ అవార్డ్ కొడతారని కొందరు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చాలామంది సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫ‌స్టాప్‌ మైండ్ బ్లోయింగ్‌(Firsthalf Mind Blowing)గా ఉంద‌ని, ముఖ్యంగా ధ‌నుష్ ఎంట్రీ త‌ర్వాత మూవీ సూప‌ర్బ్​ అంటూ పోస్టులు పెడుతున్నారు. ధ‌నుష్ త‌ప్ప మ‌రెవ‌రూ ఈ పాత్ర చేయ‌లేర‌ని, మ‌రోసారి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ప‌క్కా అంటూకామెంట్స్ వినిపిస్తున్నాయి.

    ఇక సినిమా స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉందంటున్నారు నెటిజన్లు. స్క్రీన్ ప్లే(Screen Play) సినిమాకు ప్రాణం, ఆ స్క్రీన్ ప్లే పై పాజిటీవ్ రెస్పాన్స్ వస్తే సినిమా హిట్ అయినట్టే. కుబేర మూవీ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది.. కుబేర మూవీ చాలా బాగుంది. థియేటర్​లో చూడటం మాత్రం మిస్ అవ్వకండి అని కొంద‌రు రాసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ధనుష్, నాగార్జున పెర్ఫామెన్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు.

    ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా, ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. ధనుష్ పర్ఫామెన్స్ తో పాటు నాగార్జున (Nagarjuna)పాత్ర అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శేఖర్ కమ్ముల(Director Shekhar Kammula) గొప్పగా తీశారని, చాలా సీన్లను డీఎస్పీ తన ఎలివేషన్స్‌తో పైకి లేపారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ర‌ష్మిక‌(Heroine Rashmika)కు కూడా గ‌త‌ శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌లోని పాత్ర‌ల మాదిరిగానే మంచి పాత్ర ద‌క్కింద‌ని త‌న కెరీర్ బెస్ట్ ఇచ్చింద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ నటన సినిమాకే హైలైట్ అని .. బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడ‌ని అంటున్నారు. శేఖర్ కమ్ముల కథ, తెరకెక్కించిన విధానం చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్..

    కొంచెం నిడివి ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే వస్తుందట. కానీ పూర్తిగా ఎంగేజింగ్ మోడ్‌లోనే సినిమా వెళ్తుంటుందట. ఫ‌స్టాప్ క‌న్నా సెకండాఫ్ అది కూడా ఫ్రీ క్లైమాక్స్‌లో కాస్త లాగ్ అనిపించింద‌ని, అదేవిధంగా మూవీ ర‌న్ టైం మిన‌హా సినిమా అద్భుతంగా ఉంద‌ని, శేఖ‌ర్ క‌మ్ముల త‌న స్టామినాను మ‌రోసారి చూపించాడ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న్ సీన్లు సినిమాకు ప్రాణ‌మ‌ని ఇది ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన చిత్ర‌మ‌ని తెలుపుతూ అనేక మంది 3 నుంచి 4.5 పాయింట్ల వ‌ర‌కు రేటింగ్ ఇస్తూ కుబేర Kubera బ్లాక్‌బ‌స్ట‌ర్ అని తేల్చేస్తున్నారు. డీఎస్పీ కూడా బీజీఎంతో సినిమాని అమాంతం పైకి లేపేశారు. అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకున్న ధనుష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అంటున్నారు. సెకండాఫ్‌లోని ఓ ఐదారు ఎమోషనల్ సీన్లకు మనం పెట్టిన డబ్బులకు సరిపడా కంటెంట్ వచ్చేస్తుందట. మిగతాది అంతా బోనస్ అని చెబుతున్నారు.

    More like this

    Donald Trump | ప్ర‌పంచ పెద్ద‌న్న‌ను స‌వాల్ చేస్తున్న భార‌త్‌.. పున‌రాలోచ‌న‌లో ప‌డిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Donald Trump | భార‌త్ దూసుకుపోతోంది. అనేక స‌వాళ్లు, సంక్షోభాల న‌డుమ జోరు కొన‌సాగిస్తోంది....

    Balapur Ganesh | రికార్డు ధర పలికిన బాలాపూర్​ గణేశుడి లడ్డూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balapur Ganesh | లడ్డూ వేలం అనగానే గుర్తొచ్చిది బాలాపూర్​ వినాయకుడు. ఏళ్లుగా ఈ...

    Rohit Sharma | రోహిత్ శ‌ర్మ కారుని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ముంబైలో మ‌నోడికి ఇంత ఫాలోయింగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rohit Sharma | టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి ఉన్న‌ క్రేజ్...