ePaper
More
    Homeఅంతర్జాతీయంIran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తలదూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తలదూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరుదేశాల (Israel-Iran) మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్ర దేశాలను కదిలిస్తోంది. టెహ్రాన్ అణు నిర్వహణను బూచిగా చూపి.. ఇరాన్​పై సైనిక చర్యకు దిగేందుకు అగ్రరాజ్యం అమెరికా (America – USA) సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే యూఎస్​ ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రకటనలు చేశారు.

    ఈ క్రమంలో రష్యా (Russia) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య అమెరికా సైనిక జోక్యానికి సిద్ధం కావడం సరికాదని, ఇది ప్రమాదకరమని రష్యా హెచ్చరించింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా (Russian Foreign Ministry Spokesperson Maria Zakharova) ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.

    “యూఎస్​కు హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం సరికాదు. ప్రస్తుత పరిస్థిత్తుల్లో ఆమెరికా జోక్యం అత్యంత ప్రమాదకరం” అని మారియా పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్తు కేంద్రం(Bushehr nuclear power plant)పై ఇజ్రాయెల్ చేసిన దాడి పైనా రష్యా మాట్లాడింది. తక్షణమే దాడులను ఆపాలని ఇజ్రాయెల్​ను కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహాలో విపత్తు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనిపై ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి స్పందించి మాట్లాడారు. పొరపాటు వల్లే దాడి జరిగిందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...