ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.. పర్యటనలతో బిజీగా ఉంటారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు న్యాయం చేస్తూ చదవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఓ ఎమ్మెల్యే లాయర్​ కావడం కోసం లాసెట్(lawcet)​లో ఏకంగా 739వ ర్యాంక్​ సాధించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్​లోని నందిగామ ఎమ్మెల్యే (Nandigama MLA) తంగిరాల సౌమ్య (Tangirala Sowmya) ఏపీ లాసెట్​లో 739వ ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనబరిచారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూ లాయర్‌ అవ్వాలనే లక్ష్యంతో 43 ఏళ్ల వయసులో లాసెట్​లో ఆమె ర్యాంక్​ సాధించడం గమనార్హం.

    తంగిరాల సౌమ్య తన తండ్రి ప్రభాకర్​రావు ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అదే ఏడాది మరణించారు. దీంతో ఉప ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి పోటీ చేసిన సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. నందిగామ తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె.. 2024 జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి విజయం సాధించారు.

    More like this

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...

    Registrations | రిజిస్ట్రేషన్లలో జాప్యం.. తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన...