ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల ఖాతాల్లో 214.56 కోట్ల నిధులు జమ చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. వానాకాలం సీజన్​కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద మొత్తం 2,98,472 మంది రైతులకు రూ.326.03 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ నెల 16న రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.95.66 కోట్లు, 17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్నవారికి రూ.65.06 కోట్లు, 18, 19వ తేదీల్లో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన వారికి రూ.53.84 కోట్ల నిధులు జమ చేసినట్లు వివరించారు. అలాగే కొత్త పాస్ బుక్కులు వచ్చినవారు వ్యవసాయ విస్తీర్ణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. వాడుకలో ఉన్న బ్యాంకు అకౌంట్​ నెంబర్లను అందించాలని తెలిపారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...