ePaper
More
    HomeజాతీయంAmit Shah | జాతి ఐక్యతకు భాషలే కీలకం.. ఇంగ్లిష్ మాట్లాడే వారు సిగ్గుపడే రోజు...

    Amit Shah | జాతి ఐక్యతకు భాషలే కీలకం.. ఇంగ్లిష్ మాట్లాడే వారు సిగ్గుపడే రోజు వస్తుందన్న అమిత్ షా

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amit Shah | భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడుకోవాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. భారతీయ సంస్కృతిని కాపాడడంలో సాహిత్యం పాత్రను ఆయన కాస్త నొక్కి చెప్పారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిర్దేశించిన ‘పంచ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞల) గురించి కూడా ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇది చాలా ముఖ్యమని తెలిపారు. దేశ ఐక్య‌త‌లో భార‌తీయ భాష‌లు (Indian languages) ముఖ్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. భార‌తీయ భాష‌ల వార‌స‌త్వాన్ని కాపాడుకోవాల్సిన సంద‌ర్భంగా వ‌చ్చింద‌న్నారు. మాతృ భాష‌ల‌పై గ‌ర్వంతో ప్ర‌పంచంలో ముందుకు వెళ్లాల‌న్నారు.

    Amit Shah | సిగ్గు ప‌డాల్సిన రోజు వ‌స్తుంది..

    ఈ దేశంలో.. త్వ‌ర‌లో ఇంగ్లిష్ (English) మాట్లాడే ప్ర‌జ‌లు సిగ్గుప‌డే సంద‌ర్భం వ‌స్తుంద‌ని, అలాంటి స‌మాజ ఏర్పాటు ఎంతో దూరం లేద‌ని, ప‌ట్టుద‌లతో మార్పును కోరుకునేవారితో అది సాధ్యం అవుతుంద‌న్నారు. మ‌న దేశంలోని భాష‌లు.. మ‌న సంస్కృతికి ర‌త్నాల‌ని న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు. ‘మ‌న భాష‌లు లేకుండా మ‌నం ఈ దేశవాసులం కాబోమ‌న్నారు. మార్పు సాధ్యం కాదని భావించేవారు, మార్పును నిశ్చయంగా తీసుకురాగలరని మర్చిపోతున్నారు. మన భాషలు మన సంస్కృతికి రత్నాలు, అవి లేకుండా మనం భారతీయులుగా (Indians) ఉండలేం’ అని అన్నారు. ‘అసంపూర్ణమైన విదేశీ భాషలతో (foreign language) భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఇది సులభమైన పోరాటం కాదని నాకు తెలుసు, కానీ భారతీయ సమాజం ఈ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆత్మగౌరవంతో మన భాషల్లో దేశాన్ని నడిపిస్తాం. ప్రపంచానికి నాయకత్వం వహిస్తాం’ అని అమిత్ షా అన్నారు.

    ‘ఈ దేశాన్ని, సంస్కృతిని, చ‌రిత్ర‌ను, మ‌తాన్ని అర్థం చేసుకోవ‌డ‌నానికి ఏ విదేశీ భాష స‌రిపోదు అని, అస‌మ‌గ్ర‌మైన విదేశీ భాష‌ల‌తో (foreign language) స‌మ‌గ్ర‌మైన దేశ‌భావ‌న రాదు’ అని అన్నారు. ‘ఇది చాలా సంక్లిష్ట‌మైన అంశం, కానీ భార‌తీయ స‌మాజం దీంట్లో విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాను. మ‌రోసారి మ‌న దేశాన్ని మ‌న స్వంత భాష‌ల్లో ముందుకు న‌డిపిస్తామ‌ని అనుకుంటున్న‌ట్లు’ చెప్పారు. భారతదేశానికి స్వాతంత్య్రం (India Indipendence) వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి ఈ ‘పంచ ప్రాణ్’ చాలా ముఖ్యమని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం చేసుకుకోవడం, బానిసత్వానికి సంబంధించిన ప్రతిదాన్ని వదిలించుకోవడం, మన వారసత్వం గురించి గర్వపడటం, ఐక్యతతో ఉండడం, ప్రతి పౌరుడిలో కర్తవ్యాన్ని గుర్తు చేయడమే.. ఈ ఐదు ప్రతిజ్ఞలని అమిత్​ షా అన్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...