ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Banakacharla | మనం మనం కొట్లాడితే ఎవరికి లాభం.. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక...

    Banakacharla | మనం మనం కొట్లాడితే ఎవరికి లాభం.. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla | తెలంగాణతో ప్రాజెక్ట్​లో విషయంతో తాను పోరాటం చేయనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవపడ్డానా అని ఆయన పేర్కొన్నారు. ‘‘కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే వాడుకుంటాం’’ అని వ్యాఖ్యలు చేశారు.

    బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఎవరి నీరు వారిదని, అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందామని బాబు అన్నారు. సముద్రంలోకి పోయే నీటి వాడకంపై సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నీటిని వాడుకుందామని ఆయన పేర్కొన్నారు.

    Banakacharla | ఏ ప్రాజెక్ట్​కు అనుమతి లేదు

    ప్రస్తుతం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్​కు తప్ప మిగతా వాటికి అనుమతి లేదని ఆయన తెలిపారు. ఎవరి శక్తి మేర వారు ప్రాజెక్ట్​లు కట్టుకుందామని ఆయన సూచించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్​ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్​రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు చర్చించుకొని వాడుకుందామన్నారు. ఎవరు ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కొత్త అథారిటీ నీటిని ఎలా కేటాయిస్తే అలా వాడుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...