అక్షరటుడే, ఇందూరు: MIM Nizamabad | షాదీ ముబారక్ చెక్కుల (Shadi Mubarak cheques) కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ (MIM district president Fayaz) మాట్లాడుతూ.. చెక్కుల పంపిణీ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి తహశీల్దార్ చేతులమీదుగా చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.