MLC Kavitha | నేడు హైదరాబాద్​కు రాహుల్​గాంధీ.. ఎక్స్​లో ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | నేడు హైదరాబాద్​కు రాహుల్​గాంధీ.. ఎక్స్​లో ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​లో hyderabad ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్​ సమ్మిట్ bharat summit​ కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ rahul gandhi శనివారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత mlc kavitha ఆయనకు ఎక్స్​ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. దారితప్పి తెలంగాణ Telanganaకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఆమె ఎద్దేశా చేశారు. మోసపూరిత హామీలు, అబద్దపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha | విద్యార్థులను పరామర్శించాలి

హెచ్​సీయూ భూముల hcu lands రక్షణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై కాంగ్రెస్​ ప్రభుత్వం congress govt లాఠీఛార్జి చేసిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్​గాంధీ హెచ్​సీయూ విద్యార్థులను hcu students పరామర్శించాలని ఆమె డిమాండ్​ చేశారు. బిహార్​లో గ్రూప్‌ -1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన రాహుల్​, తెలంగాణ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఆందోళనలపై జవాబు చెప్పాలన్నారు.

MLC Kavitha | ప్రజల మీదకు బుల్డోజర్లు

తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని sonia gandhi, రాహుల్ గాంధీని rahul gandhi నమ్మి అధికారమిస్తే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని కవిత అన్నారు. హైడ్రా hydra, మూసీ పేరుతో ప్రజల మీదికి బుల్డోజర్లు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో తమ భూముల కోసం ఆందోళన చేపట్టిన గిరిజనులపై థర్డ్​ డిగ్రీ ప్రయోగించిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha | హామీల అమలు ఎక్కడ..

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల six guarantees పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ వాటిని అమలు చేయడం లేదని, రాహుల్​ గాంధీ దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్​ చేశారు. రైతులకు రుణమాఫీ loanwaiver పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రైతుభరోసా rythu bharosa ఎందరికి జమ అయిందో కూడా తెలియదని ఆమె విమర్శించారు.