ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPrivate Schools | అనుమతులు లేని పాఠశాలపై చర్యలు: డీఈవో

    Private Schools | అనుమతులు లేని పాఠశాలపై చర్యలు: డీఈవో

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Private Schools | అనుమతుల్లేకుండా పాఠశాలలు నడిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు (Kamareddy Deo Raju) హెచ్చరించారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు.

    పాఠశాలలో నోటు బుక్స్, యూనిఫాంలు, బ్యాగులు, స్టేషనరీలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అమ్మకాలు చేస్తే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల (Qualified teachers) పర్యవేక్షణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. సమావేశంలో ఎంఈవో నాగేశ్వర్ రావు, డీఎల్​పీవో సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...