ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​University Rankings | క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లో ఇండియా జోరు.. నాలుగో స్థానంలో నిలిచిన...

    University Rankings | క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లో ఇండియా జోరు.. నాలుగో స్థానంలో నిలిచిన భారత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: University Rankings | QS (క్వాక్వెరెల్లి సైమండ్స్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఇండియా అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో ఇండియా నుంచి 54 ఉన్నత విద్యా సంస్థలు (HEIs) ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(University Rankings) 2026.. 106 దేశాలలోని 1,500 కంటే ఎక్కువ సంస్థలను పరిశీలించి ర్యాంకింగ్​లు ఇచ్చింది. 2014లో QS ర్యాంకింగ్స్​లో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉండగా, 2026లో ఈ సంఖ్య 54కి పెరిగింది. గత దశాబ్దంలో దాదాపు 390 శాతం పెరుగుదల నమోదైంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. ఇది భారతదేశ పరివర్తనాత్మక విద్యా సంస్కరణల ప్రతిబింబమని అభివర్ణించారు.

    University Rankings | ‘విద్యా రంగానికి’ శుభవార్త: మోదీ

    భారతదేశంలో పెరుగుతున్న ప్రపంచ విద్యా ప్రభావానికి తాజా ర్యాంకింగ్​లు బలమైన సూచిక అని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ‘X’లో పోస్ట్ చేశారు. “QS వరల్డ్ యూనివర్సిటీ 2026 ర్యాంకింగ్​లు మన విద్యా రంగానికి గొప్ప శుభవార్త. భారతదేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ఆయన అన్నారు. దేశంలో ఉన్నత విద్య, పరిశోధన మౌలిక సదుపాయాల నాణ్యతను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించాలని కూడా మోదీ నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ పోస్ట్ ను తిరిగి పోస్ట్ చేసిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan). భారతదేశ విద్యా రంగంలో చోటు చేసుకుంటున్న గణనీయమైన వృద్ధిని హైలైట్ చేశారు. ఈ ఐదు రెట్లు పెరుగుదల గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పరివర్తనాత్మక విద్యా సంస్కరణలకు నిదర్శనమని ప్రధాన్ అన్నారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 వంటి ప్రధాన విధాన మార్పుల వల్ల ఈ పెరుగుదల నమోదైందన్నారు.

    University Rankings | టాప్ 4 దేశాలలో ఇండియా

    QS- 2026 ర్యాంకింగ్స్ ప్రకారం అత్యధికంగా ప్రాతినిధ్యం వహించే దేశాలలో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ (192) మొదటి స్థానంలో ఉండగా, యునైటెడ్ కింగ్డమ్ (90), మెయిన్ల్యాండ్ చైనా (72) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇండియా(India) నుంచి 54 విద్యాసంస్థలు చోటు దక్కించుకోగా, అందులో IIT ఢిల్లీ అగ్రభాగాన నిలిచింది. భారతదేశంలో అత్యున్నత ర్యాంక్ పొందిన విశ్వవిద్యాలయంగా ఇది అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా 27 స్థానాలు ఎగబాకి 123వ స్థానానికి చేరుకుంది. ఇక IIT బాంబే 129వ స్థానంలో, IIT మద్రాస్ మొదటిసారిగా టాప్ 200లోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా 180వ స్థానంలో నిలిచింది.

    University Rankings | పరివర్తనాత్మక సంస్కరణలతోనే వృద్ధి

    ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్​లో ఇండియా గణనీయంగా మెరుగు పడడం వెనుక జాతీయ విద్యావిధానం (NEP) 2020 కీలక భూమిగా పని చేసిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. ఈ విధానాన్ని దేశ విద్యా రంగంలో విప్లవాత్మకమని అభివర్ణించారు. NEP 2020 మన విద్యా రంగాన్ని మార్చడమే కాదు, దానిని విప్లవాత్మకంగా మారుస్తోందన్నారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...