ePaper
More
    HomeసినిమాSekhar Kammula | ‘కూతురి పెళ్లి కోసం దాచుకున్న డ‌బ్బులు కాలిపోయాయి..’ ఆ స‌మ‌యంలో కంట్లో...

    Sekhar Kammula | ‘కూతురి పెళ్లి కోసం దాచుకున్న డ‌బ్బులు కాలిపోయాయి..’ ఆ స‌మ‌యంలో కంట్లో నీళ్లు తిరిగాయి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sekhar Kammula | సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల చాలా రోజుల త‌ర్వాత కుబేర చిత్రంతో ప్రేక్ష‌కుల మందుకు రాబోతున్నాడు. ఇందులో నాగార్జున‌(Nagarjuna), ధ‌నుష్(Dhanush), ర‌ష్మిక(Rashmika) ప్రధాన పాత్ర‌లు పోషిస్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇక మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర బృందం ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నశేఖ‌ర్ క‌మ్ముల‌(Sekhar Kammula) 2021లో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న గురించి పంచుకున్నాడు. కూతురి పెళ్లి కోసం ఒక రైతు రూ.2 ల‌క్ష‌లు దాచుకోగా.. ఆ డ‌బ్బు మంట‌ల్లో కాలిపోతే శేఖ‌ర్ క‌మ్ముల అత‌డికి ఆర్థిక స‌హాయాన్ని అందించాడు.

    Sekhar Kammula | ఎంతో బాధ‌ప‌డ్డాను..

    కూతురి పెళ్లి కోసం ఓ రైతు (Farmer) దాచుకున్న డబ్బు కాలిపోయింద‌ని తెలిసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు అలా కాలిపోవడం న‌న్ను తీవ్రంగా బాధించింది. బాగా డబ్బున్నవాడికి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతే కేవ‌లం బాధేస్తుంది, అలాంటిది ఒక పేద రైతు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు అలా కాలిపోతే అత‌డి బాధ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌డి క‌ష్టం ఇలా వృథా అవ్వడం నా మనసును బాగా కదిలించింది. అందుకే ఆ రైతుకు నా వంతు సహాయంగా రూ.2ల‌క్ష‌లు పంపించాను. అంటూ శేఖ‌ర్ చెప్పుకొచ్చాడు. 2021లో సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు ఇంట్లో ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగింది.

    ఆ స‌మ‌యంలో శేఖ‌ర్ క‌మ్ముల నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు. అంతేకాకుండా, లక్ష్మయ్య కుటుంబంతో స్వయంగా మాట్లాడి, అవసరమైతే మరింత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా కూతురి పెళ్లిని మంచిగా, సంతోషంగా జరిపించాలని కోరారు. కాగా, తెలుగులో కొంత విరామం తర్వాత శేఖర్​ కమ్ముల దర్శకత్వకంలో రాబోతున్న పెద్ద సినిమా.. కుబేర(Kubera). ఇప్పటిదాకా కెరీర్​లో చాలా వరకు సెన్సిబుల్ లవ్ స్టోరీలే తీసిన శేఖర్ కమ్ముల త‌న 25 ఏళ్ల కెరీర్లో పది సినిమాలు మాత్రమే చేశారు. దీని గురించి ఆయన స్పందిస్తూ.. వేరే వాళ్లకు ఇది తక్కువ అనిపిస్తుందేమో కానీ, తనకు మాత్రం చాలా ఎక్కువ అని వ్యాఖ్యానించడం విశేషం. తక్కువ సినిమాలు చేశాననే బాధ ఎంతమాత్రం లేదని చెప్పాడు. తన సినిమాల విషయంలో ఎప్పుడూ లాభాల్లో వాటా కావాలని అడగలేదని.. తనకింత పారితోషకం ఇవ్వాలని మాత్రమే తీసుకున్నానని.. దాని వల్ల చాలా నష్టపోయానని.. అయినా ఏ విషయంలోనూ తనకు బాధ లేదని స్పష్టం చేశాడు.

    More like this

    Balapur Ganesh | రికార్డు ధర పలికిన బాలాపూర్​ గణేశుడి లడ్డూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balapur Ganesh | లడ్డూ వేలం అనగానే గుర్తొచ్చిది బాలాపూర్​ వినాయకుడు. ఏళ్లుగా ఈ...

    Rohit Sharma | రోహిత్ శ‌ర్మ కారుని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ముంబైలో మ‌నోడికి ఇంత ఫాలోయింగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rohit Sharma | టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి ఉన్న‌ క్రేజ్...

    Team India Jersey | టీమ్ ఇండియా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అడిడాస్ జెర్సీలపై ఏకంగా అంత‌ భారీ తగ్గింపా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Team India Jersey | టీమిండియా అభిమానులకు శుభవార్త! టీమ్ ఇండియా అధికారిక కిట్...