ePaper
More
    Homeటెక్నాలజీIQOO New Phone | స్టైలిష్​ లుక్‌.. బిగ్​ బ్యాటరీ.. భారత్‌లో మరో కొత్త మోడల్‌ను...

    IQOO New Phone | స్టైలిష్​ లుక్‌.. బిగ్​ బ్యాటరీ.. భారత్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసిన ఐక్యూ..

    Published on

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: IQOO New Phone | చైనా(China)కు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వివో సబ్‌ బ్రాండ్‌ (VIVO Sub Brand) అయిన ఐక్యూ భారత్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఆకర్షణీయమైన లుక్‌తో, 6000 mAh బ్యాటరీ సామర్థ్యతో IQOO Z 10 Lite 5G తీసుకువచ్చింది. బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌ అవుతుందని భావిస్తున్నారు. ఐక్యూ ఇ- స్టోర్‌తో పాటు అమెజాన్‌ వెబ్‌సైట్‌ ఈనెల 25వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. దీని ‍ప్రత్యేకతలు తెలుసుకుందాం..

    IQOO New Phone | Display..

    90Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

    IQOO New Phone | Processor..

    6nm ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

    IQOO New Phone | Operating system..

    ఆండ్రాయిడ్‌ 15 (Android 15) ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్ 15 తో పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

    IQOO New Phone | Camera..

    50 MP సోనీ ఏఐ సెన్సార్‌తో కూడిన డ్యుయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెకండరీ కెమెరా 2 MP.
    5 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఏఐ ఎరేజ్‌, ఏఐ డాక్యుమెంట్‌ మోడ్‌, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లతో తీసుకొచ్చారు.

    IQOO New Phone | Battery..

    6000 mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ 15w చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఒకే చార్జ్‌లో 70 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 37 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 1,600 చార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ దాని సామర్థ్యంలో 80 శాతం నిలుపుకుంటుందని హామీ ఇస్తోంది.

    IQOO New Phone | Variants..

    4 GB +128 GB వేరియంట్‌ ధర రూ.9,999.
    6 GB +128 GB వేరియంట్‌ ధర రూ.10,999.
    8 GB +256 GB వేరియంట్‌ ధర రూ.12,999.

    IQOO New Phone | Colours..

    సైబర్‌ గ్రీన్‌, టైటానియమ్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

    IQOO New Phone | Card offers..

    SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో రూ. 500 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
    ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌తో 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...