అక్షరటుడే, బోధన్: DCHS Srinivas Prasad | ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం బోధన్ ప్రభుత్వాస్పత్రిని (Bodhan Government Hospital) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదుల్లో పెచ్చులూడిన పైకప్పులను పరిశీలించారు. వెంటనే వార్డులో ఉన్న బెడ్స్‌ను వేరే వార్డుకు మార్చాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.
