ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​MLC Kavitha | టీటీడీ ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | టీటీడీ ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu)తో ఎమ్మెల్సీ కవిత గురువారం భేటీ అయ్యారు. తిరుపతి హతిరామ్ బావాజీ మఠం(Tirupati Hathiram Bawaji Math)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు.

    ఈ మేరకు తెలంగాణ(Telangana)లోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ నెల 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు టీటీడీ ఛైర్మన్​ సానుకూలంగా స్పందించినట్లు కవిత(MLC Kavitha) తెలిపారు. బంజారా పిఠాధిపతులకు హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...