SSMB 29
SSMB 29 | జ‌క్క‌న్న మాములోడు కాదు… మ‌హేష్ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్నాడుగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్:SSMB 29 | ఆర్ఆర్ఆర్ (RRR) వంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నుండి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) హీరోగా హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికైతే సోషల్ మీడియాలో ‘SSMB 29’ అనే పేరుతో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుండ‌గా, ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. అవుట్ డోర్ లో మహేశ్ బాబు, పృథ్వీరాజ్ లపై రాజమౌళి(Rajamouli) కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో లీకైంది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు.

SSMB 29 | భ‌లే ప్లాన్..

ఇక ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళికి ఆర్థిక వ‌న‌రుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆయ‌న త‌న సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నార‌ని తెలిసింది. మ‌హేష్ కథానాయ‌కుడిగా అత‌డు రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ- ఎస్.ఎస్.ఎం.బి 29(SSMB 29) కోసం రూ.50 కోట్ల బ‌డ్జెట్ తో వార‌ణాసి సెట్ నిర్మిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి గంగా న‌ది ఒడ్డున‌ రియ‌ల్ లొకేష‌న్ల‌లో ఇలాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాలంటే అది స‌వాల్ తో కూడుకున్న‌ది. పోలీసుల నుంచి అనుమ‌తులు పొంద‌డం అంత సులువు కాదు. దాంతో పాటు, ప్ర‌జ‌ల నుంచి చాలా ఇబ్బందులు త‌లెత్తుతాయి.

ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి వార‌ణాసి(Varanasi)ని త‌ల‌పించే ఓ భారీ సెట్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. వార‌ణాసి అంటే దేవాల‌యాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మిక‌త నిండిన ప్ర‌దేశం. అలాంటి మ‌రో న‌గ‌రాన్ని నిర్మించాల‌నే ఆలోచ‌న స‌వాళ్లతో కూడుకున్న‌ది. ఒరిజినాలిటీ చెడ‌కుండా దానిని చూపించాలి. దీనికోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ స‌మ‌క్షంలో రాజ‌మౌళి ప‌ని చేస్తున్నార‌ని తెలిసింది. అడ‌విలో ప‌ర్వ‌తాల‌లో సంజీవ‌ని వ‌న‌మూలిక‌ను వెత‌క‌డానికి వెళ్లిన హ‌నుమంతుడి స్ఫూర్తితో ఈ క‌థ‌ను రూపొందించార‌ని టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka chopra)కథానాయిక‌. పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.