అక్షరటుడే, ఇందూరు: D Srinivas | దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (Late former minister D. Srinivas) విగ్రహాన్ని త్వరలో నగరంలో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి కంఠేశ్వర్ బైపాస్ వద్ద చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది జూన్ 29న డీఎస్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తదనంతరం మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో నగరంలో డీఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దానికనుగుణంగా కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా (Kanteshwar Bypass Crossroads) వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
D Srinivas | అమిత్షా రానున్న నేపథ్యంలో..
జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (National Turmeric Board Central Office) ఇటీవల నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూరల్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Union Home Minister Amit Shah) రానున్నారు. ఆయన డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.