ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ఈదురు గాలులకు కూలిన చెట్టు.. పట్టించుకోని అధికారులు

    Nizamabad City | ఈదురు గాలులకు కూలిన చెట్టు.. పట్టించుకోని అధికారులు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలో వారం రోజుల క్రితం భారీ ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఈ క్రమంలో రైతుబజార్​ వెనుక ప్రాంతంలో సైతం ఓ చెట్టు కూలి ఇంటిపై ఒరిగింది. మిగతా చోట్ల చెట్లు తొలగించిన సిబ్బంది.. దీనిని మాత్రం ఇప్పటి వరకు తొలగించలేదు. ఈ ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అలాగే స్థానికుల రాకపోకలు కొనసాగుతుంటాయి. చెట్లును తొలగించకపోవడంతో ఎప్పుడు పడిపోతుందోననే ఆందోళన చెందుతున్నారు.

    ఈ విషయమై అధికారులకు వివరించినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చెట్టుకు ఆనుకుని విద్యుత్​ తీగలు కూడా ఉన్నాయని.. దీంతో చెట్టు మరింత కూలితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్​శాఖ సిబ్బంది కాని, మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు గాని, రైతు బజార్​ సిబ్బంది గాని పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. నిత్యం వాహనాలు తిరిగే మార్గంలో ఓ ఇంటిపై చెట్టు కూలి వారం రోజులు గడుస్తున్నా తమకు సంబంధం లేనట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...