ePaper
More
    Homeఅంతర్జాతీయంIran - Israel | ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా ప్ర‌ణాళిక‌.. ట్రంప్ ఆమోదం తెలుప‌గానే దాడులు

    Iran – Israel | ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా ప్ర‌ణాళిక‌.. ట్రంప్ ఆమోదం తెలుప‌గానే దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran – Israel | ఇరాన్ అణు కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించేందుకు అమెరికా సైనిక చ‌ర్య చేప‌ట్టాల‌ని యోచిస్తోంది. ఇప్ప‌టికే దాడుల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను ఖ‌రారు చేసింది. అయితే, దీనిపై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇంకా తుది ఉత్తర్వులు జారీ చేయ‌లేదు. ఇరాన్‌పై సైనిక దాడికి సంబంధించిన ప్రణాళికలను సమర్థిస్తున్నానని ట్రంప్ తన సీనియర్ సహాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా తుది ఉత్తర్వు ఇవ్వలేదు. తదుపరి చర్యలు చేప‌ట్టేందుకు ముందు ఇరాన్(Iran) తన అణు కార్యక్రమాన్ని ఆపివేస్తుందో లేదో వేచి చూడాలని ట్రంప్ కోరుకుంటున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal) తెలిపింది. ప‌ర్వ‌త భూగర్భంలో, అత్యంత ప‌టిష్టంగా నిర్మించిన ఇరాన్​లోని ఫోర్డో అణుకేంద్రాన్ని దెబ్బ తీయాలంటే అత్యంత శక్తివంతమైన బంకర్-బాంబులు అవ‌స‌రం. ఇవి కేవ‌లం అమెరికా(America) వ‌ద్ద మాత్ర‌మే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరాన్ అణుకార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించాలంటే అమెరికా రంగంలోకి దిగ‌డం త‌ప్ప‌నిస‌రి.

    Iran – Israel | కాల్పుల విర‌మ‌ణ కాదు.. విజ‌యం కావాలి

    ఇరాన్‌పై దాడి విష‌యంలో ట్రంప్ సూటిగా స్పందించ‌లేదు. దాడి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారా అని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్నకు ఆయ‌న బ‌దులిస్తూ.. “నేను దాడి చేయవచ్చు, చేయకపోవచ్చు” అని తెలిపారు. అదే స‌మ‌యంలో “వచ్చే వారం చాలా పెద్దది నిర్ణ‌యం ఉంటుంది, బహుశా వారం కంటే ముందే అది జ‌రుగొచ్చని” తెలిపారు. ముందస్తు షరతులు లేకుండా ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను పూర్తిగా వదులుకోవాలని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించడానికి ముందు ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని వారాల దూరంలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(Supreme Leader Ayatollah Ali Khamenei) నేతృత్వంలోని ఇరాన్ అణు ప్రణాళికలకు వ్యతిరేకంగా తన దృఢమైన వైఖరిని నొక్కి చెబుతూ, తాను ఇప్పుడు సంపూర్ణ విజయాన్ని కోరుకుంటున్నానని, కాల్పుల విరమణ కాదని అన్నారు. “మేము కాల్పుల విరమణ కోసం చూడడం లేదు. మేము పూర్తి విజయం కోసం చూస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఫోర్డో సౌకర్యాన్ని లక్ష్యంగా చేసుకోవడంలో ఉన్న సవాళ్ల గురించి పేర్కొంటూ తాము మాత్రమే దీన్ని ఛేదించ‌గ‌ల‌మ‌ని చెప్పారు. కానీ అది మేము చేస్తామ‌ని కాద‌ని పేర్కొన్నారు.

    Iran – Israel | మధ్యప్రాచ్యంలో బ‌ల‌గాల మోహ‌రింపు

    మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బ‌ల‌గాల‌ను భారీగా మోహ‌రిస్తోంది. మూడో నేవీ డిస్ట్రాయర్ తూర్పు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించింది. మరో విమాన వాహక నౌక అరేబియా సముద్రం వైపు వెళుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. రక్షణాత్మకమైన చర్య‌ల్లో భాగంగానే ఈ మోహరింపు అని పెంటగాన్(Pentagon) నొక్కి చెబుతోంది. అయితే ఇరాన్‌తో మరింత వివాదం తలెత్తితే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచేందుకే బ‌ల‌గాల మోహ‌రింపు అని తెలుస్తోంది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...