అక్షరటుడే, వెబ్‌డెస్క్:Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వడగళ్ల(hailstorms) వాన కూడా పడొచ్చని తెలిపింది. కాగా శుక్రవారం సాయంత్రం పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్(Hyderabad)లో సాయంత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
