ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Ambati Rambabu | మాజీ మంత్రి అంబటిపై మరో కేసు

    Ambati Rambabu | మాజీ మంత్రి అంబటిపై మరో కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారని వరుస కేసులు నమోదు చేస్తున్నారు. అంబటి సహా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు(Incharges), కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం గమనార్హం. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించారని అంబటిపై కేసు నమోదు చేశారు.

    వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Chief Minister Jagan)​ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే జగన్​ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్​ను పంపిన పోలీసులు తర్వాత బారీకేడ్లు పెట్టి పలు వాహనాలను ఆపేశారు. దీంతో మాజీ మంత్రి అంబటి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలను ఎందుకు ఆపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా.. జూన్​ 4న వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంలో పాల్గొన్న సందర్బంగా కూడా గుంటూరులో అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు ఆయన వారితో వాగ్వాదం చేయగా విధులకు ఆటంకం కలిగించారని గుంటూరు పట్టాభిపురం పోలీస్​ స్టేషన్​(Guntur Pattabhipuram Police Station)లో కేసు నమోదైంది.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...