అక్షరటుడే, బాన్సువాడ/నిజామాబాద్ సిటీ :Varni | వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా(Varni Market Committee Chairman Suresh Baba) కారు గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. సురేశ్ బాబా తన కారులో మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్(Hyderabad) బయలుదేరారు. వర్ని మండలం కూనిపూర్(Koonipur) శివారులో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
