ePaper
More
    HomeతెలంగాణWeather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన

    Weather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Update | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్రంలో వానలు లేవు. అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains ) కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం – అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చెరుదుమదురు వానలు పడతాయి. హైదరాబాద్ నగరంలో సాయంత్రం – రాత్రి సమయంలో తేలికపాటి – మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    Weather Update | అన్నదాతల హర్షం

    ఈ సీజన్​లో వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో అన్నదాతలు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఇప్పటికే తుకాలు పోయగా.. పలు ప్రాంతాల్లో వరి నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. రైతులు సాగు పనుల్లో బిజీ అయిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) కూడా విడుదల చేయడంతో ఎరువులు ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.

    More like this

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....