ePaper
More
    HomeతెలంగాణFormula E race case | ఏసీబీకి సెల్​ఫోన్లు ఇవ్వని కేటీఆర్​..

    Formula E race case | ఏసీబీకి సెల్​ఫోన్లు ఇవ్వని కేటీఆర్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E race case | ఫార్ములా– ఈ కారు రేస్ కేసు (Formula E race case )లో ఏసీబీ(ACB) విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR)​ తన సెల్​ఫోన్లను అధికారులకు అప్పగించలేదు. ఇందుకు ఆయన నిరాకరించారు.

    గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా – ఈ రేసులో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు కేటీఆర్​ సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లో ఉన్నాయని ఏసీబీ భావిస్తోంది. ఈ క్రమంలో వాటిని తమకు బుధవారం లోగా అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది. అయితే కేటీఆర్​ మాత్రం గడువులోగా వాటిని అప్పగించలేదు. ఇదే సమయంలో ఆయన ఏసీబీకి లేఖ రాశారు.

    ఏసీబీ (ACB) నోటీసుల మేరకు తాను విచారణకు హాజరైనట్లు కేటీఆర్​ లేఖలో పేర్కొన్నారు. 2021 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసు అందిన సమయం నుంచి పరికరంలో ఎటువంటి సమాచారాన్ని తొలగించవద్దని పేర్కొంది. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐప్యాడ్ వంటి ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా సమర్పించాలని ఏసీబీ ఆదేశించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

    Formula E race case | అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన

    ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అన్ని వివరాలు మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, అర్బన్​ డెవలప్​మెంట్​ (MAUD) శాఖ వద్ద ఉన్నట్లు కేటీఆర్​ లేఖలో తెలిపారు. అయితే తన ఫోన్​, ఎలక్ట్రానిక్​ పరికరాలు సమర్పించాలనడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని కేటీఆర్​ పేర్కొన్నారు. అది ప్రాథమిక హక్కులను (Fundamental rights) ఉల్లంఘించడేమనని అన్నారు. దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమని నిర్ధారణకు రావడానికి ఎటువంటి ఆధారం లేదని ఆయన లేఖలో తెలిపారు.

    గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కూడా నిందితులుగా ఉన్న వ్యక్తుల ఫోన్లలోని కంటెంట్‌ను యాక్సెస్ చేయవద్దని ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. అంతేగాకుండా 2024లో తాను కొత్త ఫోన్​ కొనుగోలు చేసినట్లు తెలిపారు. పాత ఫోన్​ తన వద్ద లేదన్నారు. అలాగే తాను ఏ ఇతర ఎలక్ట్రానిక్​ పరికరాలు ఉపయోగించలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే కేటీఆర్​ లేఖపై ఏసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...