ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Kondapur Flyover | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. త్వరలో కొండాపూర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

    Kondapur Flyover | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. త్వరలో కొండాపూర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kondapur Flyover | హైదరాబాద్​ (Hyderabad city traffic) మహా నగరంలో ట్రాఫిక్​ సమస్య రోజురోజుకు తీవ్రం అవుతోంది.

    హైదరాబాద్ నగర జనాభా పెరుగుతుండటంతో ప్రజలు గంటల కొద్ది ట్రాఫిక్​ జామ్​లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు కొలువై ఉన్న గచ్చిబౌలి, హైటెక్​సిటీ, మాదాపూర్​, కొండాపూర్​ ప్రాంతాల్లో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్​ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండాపూర్​–గచ్చిబౌలి మార్గంలో ఫ్లై ఓవర్​ను నిర్మించింది. దీనిని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జూన్​ 28న ప్రారంభించనున్నారు.

    Kondapur Flyover | సీఎం చేతులమీదుగా ప్రారంభం

    గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లై ఓవర్ (Gachibowli-Kondapur Flyover)​ను రూ.172 కోట్లతో 1.2 కిలోమీటర్ల మేర నిర్మించారు. దీనికి మాజీ మంత్రి పీ జనార్దన్​ రెడ్డి (PJR) పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్​ను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    కాగా.. ఇక్కడ త్రీ లెవెల్​ ఫ్లై ఓవర్​లను ప్రభుత్వం నిర్మించింది. మొదటి దశలో గచ్చిబౌలి జంక్షన్​ ఫ్లై ఓవర్​ నిర్మించారు. లెవల్​ –2లో శిల్పా లేఔట్ ఫేజ్​–1 ఫ్లై ఓవర్​ నిర్మించారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం చేయడానికి మూడో దశలో 1.2 కిలోమీటర్ల మేర మరో ఫ్లై ఓవర్​ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి నుంచి ఓఆర్​ఆర్,​ హైటెక్ ​సిటీ వెళ్లడానికి సమయం ఆదా కానుంది.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...