ePaper
More
    HomeజాతీయంCab Drivers App | క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త పోలీస్ యాప్.. ఓలా, రాపిడ్‌ల‌తో...

    Cab Drivers App | క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త పోలీస్ యాప్.. ఓలా, రాపిడ్‌ల‌తో ఇక ఏ చింత లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Cab Drivers App | క్యాబ్‌ల‌లో ప్ర‌యాణించే ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం పోలీస్ శాఖ కొత్త యాప్‌(Police Department New App)ని ప‌రిచ‌యం చేసింది.

    ఈ యాప్ ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇంత‌కీ ఆ యాప్ ఏంటంటే.. అభ‌య మై ట్యాక్సీ ఈజ్ సేఫ్(Abhaya My Taxi is Safe). కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి భ‌ద్రతా ప్రమాణాల‌ని పెంచుతూ ఆదిలాబాద్‌లో (Adilabad) తొలిసారి ఈ యాప్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ యాప్‌ను ఉపయోగించి అవసరమైన సమయాల్లో అత్యవసర సహాయం కూడా పొందవచ్చు. ఇది ప్రయాణికులకు భద్రతను కూడా అందిస్తుంది.

    Cab Drivers App | ఇక ఎలాంటి టెన్ష‌న్ లేదు..

    తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడం కోసం ఆన్‌లైన్ ట్రాకింగ్ (Online tracking) ద్వారా డ్రైవర్ ఏ రూట్‌లో వెళుతున్నాడు అనేది తెలుసుకోవచ్చు. పోలీసులు ఈ యాప్ ద్వారా డ్రైవర్ల నుండి వచ్చిన సిగ్నల్స్‌ను సులభంగా ట్రాక్ చేసి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోగలుగుతారు. ప్రస్తుతం, ఓలా(Ola), రాపిడో (Rapido) వంటి ప్రముఖ క్యాబ్ సర్వీసులకు ఈ కొత్త యాప్‌ మరింత సమర్థవంతంగా, యాత్రికుల భద్రతను పెంచేందుకు ఉపయోగపడుతుంది. పోలీస్ శాఖ కూడా ఈ కొత్త టెక్నాలజీని ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేయడానికి ఉపయోగిస్తుందంటూ స్పష్టం చేసింది.

    అభ‌య మై ట్యాక్సీ (abhaya my taxi) ఈజ్ సేఫ్ యాప్‌లో ఇప్ప‌టికే 3వేల 232 మంది ఆటో య‌జ‌మానులు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. రూ.350ల‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే ఆటో య‌జ‌మానుల‌కి ఏడాది పాటు ల‌క్ష ప్ర‌మాద భీమా వ‌ర్తిస్తుంది. ఈ యాప్‌ని మ‌హిళలు, వృద్ధులు, విద్యార్ధులు కూడా సులువుగా వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆటోలో ముందు, వెన‌క భాగం, లేదంటే ఆటో లోప‌ల‌, క్యూ ఆర్ కోడ్‌తో పాటు ఆటో న‌డిపే వ్య‌క్తి వివ‌రాలు ఉంటాయి. మీకు ఏదైనా అత్య‌స‌రం అనిపిస్తే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి త‌మ లొకేష‌న్ ని ట్రాక్ చేయ‌వ‌చ్చు. క్యూ ఆర్ కోడ్ క‌లిగిన ఆటోలో ప్ర‌యాణం సుర‌క్షితం అని ఎస్పీ అఖిల్ మ‌హాజన్ (SP Akhil Mahajan) తెలియ‌జేశారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...